నవీపేట్ మండల కేంద్రంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన నవీద్ కి సంబంధించిన టిప్పర్ కాగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి అట్టి టిప్పర్ ను సంబంధిత అధికారులకు తగు చర్య నిమిత్తం అప్ప చెప్పజెప్పనున్నట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. అక్రమ ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.