గాంధారి మండలం గౌరారం కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు సరోజ, నిరోష, ఫౌజియా మరియు సరిత లను సన్మానించారు.