యంచ: మంటలు అంటుకుని వృద్ధురాలు మృతి

59చూసినవారు
యంచ: మంటలు అంటుకుని వృద్ధురాలు మృతి
నవీపేట మండలం యంచకు చెందిన పోసాని (63) అనే వృద్ధురాలు చలిమంట అంటుకుని మృతి చెందారు. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నెల 13న రాత్రి వేళ ఇంట్లో చలిమంట వేసుకున్నారు. ప్రమాదవ శాత్తు ఆమె చీరకు మంటలు అంటుకోవడంతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి ఆర్పివేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆమెను నిజామాబాద్ జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ ఘటన పై కేసు నమోదైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్