అగ్నివీర్ కు ఎంపికైనా జిల్లా వాసి

5102చూసినవారు
అగ్నివీర్ కు ఎంపికైనా జిల్లా వాసి
జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిని ముడేటి ప్రియాంక అగ్నివీర్ కు ఎంపికైనట్లు మంగళవారం కోచ్ ప్రశాంత్ తెలిపారు. ఇందల్వాయి మండలం అన్సాన్ పల్లికి చెందిన మల్లయ్య, సావిత్రి దంపతుల చిన్న కూతురు ముడేటి ప్రియాంక 2023 మే లో కరీంనగర్ లోజరిగిన అగ్నివీర్ ఎంపిక పరీక్షలో సత్తా చాటింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో శిక్షణకు ఎంపికైంది. శిక్షణ నిమిత్తం బెంగుళూరు వెళ్లనుంది.

సంబంధిత పోస్ట్