కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి నీలకంటి సంతోష్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మూడు తరాల ఉద్యమ నేత, మాజీమంత్రి, డిప్యూటీ స్పీకర్, తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసిన మొదటి వ్యక్తి, పీడిత ప్రజల పక్షపాతి అని కొనియాడారు.