పిట్లం మండల కేంద్రంలోని సంతోష్ కిరాణం మరియు జనరల్ స్టోర్ లో బుధవారం ప్రభుత్వ నిషేధిత గుట్కా పదార్థాలు అమ్ముతున్నారన్న పక్క సమాచారం మేరకు పిట్లం ఎస్సై రాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా దాదాపు రూ. 2,35,560 విలువ గల ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్ల సంచులను పట్టుకున్నారు. ఆ ఉత్పత్తులను స్వాధీన పరుచుకుని షాప్ యజమాని పద్మ, రామ కృష్ణ మీద కేసు నమోదు చేయడం జరిగిందని పిట్లం ఎస్సై రాజు తెలిపారు.