మాచారెడ్డి: సైబర్ వలలో పడి మోసపోయిన యువకుడు
By అనుమతి 83చూసినవారుసైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయిన యువకుడు రూ. 2.75 లక్షలు పోగొట్టుకున్న ఘటన మాచారెడ్డిలో చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 18న ఎల్లంపేటకు చెందిన భూక్య సంతోష్ కు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో ఇంగ్లాండ్ కరెన్సీ 16 పౌండ్లు పంపిస్తున్నామని నమ్మబలికి అతని వద్ద నుంచి దశలవారీగా రూ. 2.75 లక్షలు కాజేశారు. చివరికి మోసపోయానని గ్రహించి సంతోష్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు.