దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు

50చూసినవారు
దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు
కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ త్రిశూల్ సేన వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పూర్ణచందర్ ఆధ్వర్యంలో విగ్రహదాత కె. సంతోష్ రాణి- హరీష్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భవాని స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్