అదుపు తప్పి లారీ బోల్తా

11485చూసినవారు
అదుపు తప్పి లారీ బోల్తా
లారీ అదుపు తప్పి కిందపడిన ఘటన మాచారెడ్డి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ ఘన్పూర్ శివారులో కల్వర్టు సమీపానికి రాగానే అదుపుతప్పి కిందపడింది. వాహనంలో చోదకుడితో పాటు యజమాని ఉన్నారు. చోదకుడి నిద్రమత్తు కారణంగా లారీ రోడ్డు కిందకు వెళ్లి బోల్తాపడి ఉండొచ్చని ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదని ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్