Mar 05, 2025, 08:03 IST/
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు: హరీశ్ రావు
Mar 05, 2025, 08:03 IST
TG: సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్లోని రంగనాయక సాగర్లోకి కాలేశ్వరం పంప్ హౌసుల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. తన కోరిక మేరకు ఒక్క టీఎంసి నీటిని ఉత్తమ్ విడుదల చేశారని తెలిపారు. కేసీఆర్ మీద కోపంతోనే, బీఆర్ఎస్ మీద కోపంతోనే, తెలంగాణ రైతులకు అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నామని హరీశ్ వెల్లడించారు.