గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మోర్తాడ్ మండల కేంద్రంలోని మొండివాగులో చేపలు పట్టేందుకు వెళ్లి సురేష్ అనే వ్యక్తి గల్లంతైయ్యాడు. సురేష్ వ్యవసాయ కూలీగా పనిచేస్తుండగా మొండివాగులో చేపలు పట్టేందుకు వెళ్లి అందులో పడిపోయాడు. అతను ఆచూకీ ఎంతగాలించిన లభించలేదు. బుధవారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో వంతెనవద్ద మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.