మోర్తాడ్: ప్రైవేటులో అమ్మినా బోనస్ ఇవ్వాలి
మోర్తాడ్: అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన పలు కార్యక్రమాలకు వెళ్తూ మార్గమధ్యంలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వద్ద ఆగారు. వడ్లను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వమే క్వింటాలుకు రూ.2,800 ధరతోపాటు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి కొంటామంటుండగా, వ్యాపారులకు ఎందుకు అమ్ముకుంటున్నారన్నారు.