చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి..
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు నందిపేట ఎస్సై శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మండలంలోని కుధావన్ పూర్ గ్రామంలో 13వ తేదీ రాత్రి సమయంలో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గ్రామస్తులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఏ పీఎస్ పరిధిలోనైనా మిస్సింగ్ కేసు నమోదు అయినచో నందిపేట్ పోలీస్ స్టేషన్ కు సంప్రదించాలని కోరారు.