నందిపేట్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మత్తుల పనులు జరుగుతున్న నేపథ్యంలో శనివారం నందిపేట్ మరియు మాక్లూర్ మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్ కో ఏడీఈ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కరెంట్ ఉండదని తెలిపారు.