పెళ్లిలో మటన్ కోసం లొల్లి
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఓ పెళ్లిలో మటన్ కర్రీ చిచ్చు పెట్టింది. పెళ్లి కొడుకు తరపు వారికి మాంసం తక్కువ వేశారని గొడవ మొదలైంది. దీంతో ఇరు వర్గాలకు చెందిన కొందరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. బుధవారం ఈ వేడుక హాల్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.