కమ్మర పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గురువారం నూతనంగా నిర్మించి ప్రతిష్టాపించిన గ్రామదేవతలైన పెద్ద పోచమ్మ, మహాలక్ష్మి అమ్మ వార్లకు బోనాలు సమర్పించడానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతారాజుల గావు పడుతూ ఆట పాటలతో పూజలు చేస్తూ దేవతల గొప్ప చరిత్రను వివరిస్తూ ఊరేగింపులతో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.