నిజామాబాద్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు సొంత చెల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతిని బెదిరించి పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడంతో గర్భం దాల్చింది. ఈ విషయం బాధితురాలి తండ్రికి తెలియడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.