నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జన్మదినాన్ని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. రవి మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పరిపాలన అందించారని అన్నారు. పిల్లలంటే నెహ్రుకు చాలా ఇష్టమని, అందుకే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అని పిలుస్తారన్నారు.