తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ డైరీని మంగళవారం నిజామాబాద్ కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మంజూరైన నిధులతో టెండర్ పిలిచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అక్రిడిటేషన్ కార్డ్ సమస్యలు తలెత్తకుండా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల సంజీవ్, బాలాజీ, గంగాదాస్, ప్రసాద్, ప్రమోద్ గౌడ్, శేఖర్ పాల్గొన్నారు.