వివాహిత అనుమానాస్పద మృతి

18076చూసినవారు
వివాహిత అనుమానాస్పద మృతి
నిజామాబాద్ జిల్లా పరిధిలోని సిరికొండ మండలం తుంపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు భర్త ఇంటికి నిప్పంటించారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న సిరికొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. లలిత మృతి పై ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు బాధితులకు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్