రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం పటాన్చెరులో తలపెట్టిన సభకు ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట మండలంలోని ఆయా గ్రామాల రేషన్ డీలర్లు మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సంఘం మండలాధ్యక్షుడు అన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పటాన్చేరు సభలో కీలక నిర్ణయాలు తీసుకుంటారన్నారు.