తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ నాటికి ఉండదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..'గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయింది. BRS ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకుంది. పదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదు.. దోపిడీనే జరిగింది' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.