తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసిన లీడర్లకు మాత్రమే పదవులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరికే విద్యా, బీసీ, వ్యవసాయ కమిషన్లలో చోటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ మూడు కవిషన్లలో చోటు దక్కించేందుకు చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నారు. అయితే పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు అని తేల్చిసినట్లు సమాచారం.