TG: నెల రోజుల కిందట చైతన్యపురిలో ఓ మగ శిశువును అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రాచకొండ మాల్కాజిగిరి ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు కోలా కృష్ణవేణి గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి నలుగురు పిల్లలను కాపాడిన విషయం తెలిసిందే. వారిని విచారించినప్పుడు మరో 21 మంది పసిపిల్లల విక్రయాల భాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మరో 10 మంది పసి పిల్లలను కాపాడారు. ఇలా ఇప్పటివరకు 14 మంది పసి పిల్లలను కాపాడారు.