పెళ్లి చేయలేదని తండ్రిని కుమారుడు చంపిన దారుణ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో చోటుచేసుకుంది. అనంతగిరికి చెందిన మహిపాల్ తన తండ్రి గౌరు అమృతాన్ని గొంతు నులిపి చంపేశాడు. ఆ తర్వాత సాధారణ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి చేయకపోవడంతోనే తండ్రిని చంపానని విచారణలో మహిపాల్ అంగీకరించాడు.