రూ.9.45 కోట్లు చెల్లించాలని జొమాటోకు నోటీసులు

65చూసినవారు
రూ.9.45 కోట్లు చెల్లించాలని జొమాటోకు నోటీసులు
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా కర్ణాటకలోని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్ (ఆడిట్) నుంచి రూ.9.45 కోట్లకు సంబంధించిన నోటీసులను అందుకుంది. కర్ణాటక పన్ను నియంత్రణ సంస్థ జొమాటోను 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.9.45 కోట్ల జీఎస్టీ చెల్లించాలని తన నోటీసులో పేర్కొంది. దీనిపై జొమాటో స్పందిస్తూ.. సంబంధిత అథారిటీ ముందు అప్పీల్‌ దాఖలు చేస్తామని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్