మదుపరులుకు NSE హెచ్చరిక

52చూసినవారు
మదుపరులుకు NSE హెచ్చరిక
డీప్‌ఫేక్‌ వీడియోలతో జాగ్రత్తగా ఉండాలని మదుపరులను ఎన్‌ఎస్‌ఈ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తమ ఎండీ, సీఈవో ఆశిశ్‌కుమార్‌ చౌహాన్‌ పెట్టుబడి సలహాలను ఇస్తున్నట్టు వస్తున్న ఆడియో, వీడియో క్లిప్‌లను నమ్మవద్దని.. అవన్నీ మోసపూరితమైనవేనని ఓ ప్రకటనలో పేర్కొన్నది. అలాంటి తప్పుడు వీడియోలు ప్రసారం కాకుండా చూడాలని వివిధ సామాజిక మాధ్యమాలకూ విజ్ఞప్తి చేసింది. మదుపరులకు తాము ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటే తమ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే ఇస్తామని కూడా స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్