నేడు టీడీఎల్‌పీ సమావేశం

59చూసినవారు
నేడు టీడీఎల్‌పీ సమావేశం
విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు టీడీపీ శాసనసభా పక్షం (టీడీఎల్‌పీ) సమావేశం జరగనుంది. శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. సమావేశం అనంతరం వీరంతా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్