ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ లేఖ

51చూసినవారు
ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ లేఖ
‘దేవ‌ర’ సినిమా సూపర్ హిట్ కావడంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ తన అభిమానులు, ప్రేక్షకులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లేఖ రాశారు. ‘దేవ‌ర పార్ట్-1కి అందుతున్న అద్భుత‌మైన స్పంద‌న‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా ఎప్పటికీ నా హృద‌యంలో ప్ర‌త్యేక స్థానం కలిగి ఉంటుంది. ఈ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు, అద్భుత‌మైన సంగీతం ఇచ్చిన అనిరుధ్‌కు ప్రత్యేక ధ‌న్య‌వాదాలు’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్