పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయం పొందడం అంత ఈజీ కాదు. అయితే పోస్టాఫీస్ అందిస్తున్న ' సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్'లో చేరితే ప్రతి నెలా రూ.20 వేల వరకు పొందొచ్చు. 60 సంవత్సరాల వయసున్న వారు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ పథకం ఐదేళ్ల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంది. ఉదాహరణకు ఈ పథకంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి ఏడాది దాదాపు రూ.2,46,000 వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తే రూ.20,500 అందుతుంది.