తలకు నూనె పూసుకోవడం, ఒంటికి నూనె పట్టించుకోవడం సర్వసాధారణం. అయితే, స్నానం చేసిన తర్వాత నూనె రాసుకుంటానంటే ఇంట్లో పెద్దలు అగ్గిమీద గుగ్గిలం అవుతారు. శాస్త్రీయమైన అవగాహనతోనే స్నానానికి ముందే నూనె రాసుకోవాలని సూచించారు. తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే.. స్వేద రంధ్రాలు విచ్చుకుంటాయి. అందులో అప్పటికే పేరుకుపోయిన దుమ్ము ఏదైనా ఉంటే.. అదీ తొలగిపోతుంది.