వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న 'లక్కీ భాస్కర్' మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సినిమాను క్వాలిటీగా అందించేందుకు మరోసారి పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని, 80, 90ల నాటి సెట్‌లను రీక్రియేట్ చేశామని తెలిపారు. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోన్నారు.