పిడుగుపాటుకు గురై పదేళ్లలో భారత్‌లో 30 వేలమంది మృతి

544చూసినవారు
పిడుగుపాటుకు గురై పదేళ్లలో భారత్‌లో 30 వేలమంది మృతి
దేశవ్యాప్తంగా పిడుగుపాటు కారణంగా మరణాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. 2010 నుంచి 2020 మధ్యకాలంలో పిడుగుపడి దాదాపు 30 వేల మంది మరణించారు. 1967 నుంచి 2020 మధ్య పిడుగుపాటుకు మరణాలు 1,01,309 ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కేవలం 2010 నుంచి 2020 మధ్య ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిన ఫ్రీక్వెన్సీ లాంటివి పిడుగులు పడేందుకు కారణమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్