AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని CM చంద్రబాబు వెల్లడించారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి (33+2 మంది) రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు.