రిపేర్ కోసం రూ.42,000 అడుగుతున్న వన్‌ప్లస్ కంపెనీ.. అదే ధరకు కొత్త ఫోన్ వస్తుందంటున్న వినియోగదారులు

595చూసినవారు
రిపేర్ కోసం రూ.42,000 అడుగుతున్న వన్‌ప్లస్ కంపెనీ.. అదే ధరకు కొత్త ఫోన్ వస్తుందంటున్న వినియోగదారులు
'డెడ్ మదర్ బోర్డ్' సమస్యల వల్ల పనిచేయని ఫోన్లను రిపేర్ చేసేందుకు వన్‌ప్లస్ కంపెనీ రూ.42,000 వరకు అడుగుతోందని పలువురు వన్‌ప్లస్ వినియోగదారులు పేర్కొన్నారు. ఫోన్‌లలో వచ్చిన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వన్‌ప్లస్ 10 ప్రొ, వన్‌ప్లస్ 9 ప్రొ ఫోన్లు పనిచేయడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వన్‌ప్లస్ 10 ప్రొ 5G ఫోన్ ధర ఆన్‌లైన్‌లో సుమారు రూ.44,000గా ఉంది.

సంబంధిత పోస్ట్