TG: కేసులకు భయపడకుండా సీఎం రేవంత్ కు చుక్కలు చూపెట్టే వాళ్లు ముందుకు రావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసులకు భయపడే వాళ్లు నాయకులు కాదని, ఎవరిపై ఎక్కువ కేసులు అయితే వారే పెద్ద నాయకులు అవుతారని చెప్పారు. 'పోయింది అధికారం మాత్రమే. పోరాట పటిమ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలపై నిలదీస్తూ ఈ నాలుగేళ్లు ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టాలి' అని కార్మిక విభాగానికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.