ఆస్కార్ వేడుకలకు రూ.4 వేల కోట్ల ఖర్చు!

56చూసినవారు
ఆస్కార్ వేడుకలకు రూ.4 వేల కోట్ల ఖర్చు!
ఆస్కార్ శతాబ్ది ఉత్సవాల(ఆస్కార్ అవార్డుల వందో వేడుక) సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో జరగనున్న ఈ వేడుకల కోసం ఆస్కార్ నిర్వాహకులు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తుండటం హాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. 'ఆస్కార్-100' పేరిట ఈ వేడుకలు జరగనున్నట్లుగా రోమ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్కార్ ప్రతినిధులు వెల్లడించారు. వేడుకల కోసం 500 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 4 వేల కోట్లు) ఖర్చుచేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్