భారత్‌లో మే, జులైలో 4,054 మసాలాల నమూనాల్ని పరీక్షించగా, 474 (12%) మసాలాలు నాణ్యత, భద్రత విషయంలో నిబంధనలకు తగ్గట్లుగా లేవని తేలిందని FSSAI డేటాను ఉటంకిస్తూ నివేదికలు తెలిపాయి. ప్రమాణాలకు అనుగుణంగా లేని నమూనాలపై తగిన చర్యలు తీసుకున్నామని FSSAI తెలిపింది. ఆ మసాలా బ్రాండ్ల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా బ్రాండ్లపై పలు దేశాలు ఆంక్షలు విధించిన కొన్ని నెలలకే ఇది జరిగింది.