నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు

75చూసినవారు
నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు
ఒకటో తరగతి విద్యార్థికి ప్రభుత్వ బడిలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌ కలిపి 14 వరకు ఉన్నాయి. ప్రైవేట్‌ బడిలో మాత్రం 26 ఉంటాయి. అలాగే పదో తరగతిలో ప్రభుత్వ స్కూల్లో 18 ఉండగా.. కార్పొరేట్‌ స్కూల్‌లో అన్ని కలిపి 48 వరకు ఉంటాయి. పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, కాపీ రైట్‌, ఎక్సర్‌‌సైజ్‌ నోట్స్‌.. ఇలా అన్ని కలిపి 20 కిలోలకు పైగా బరువు ఉంటుంది. రోజు పిల్లలు స్కూల్‌కు బ్యాగును పట్టుకొని వెళ్తూ ఇంటికి వచ్చేసరికి నీరసించి పోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్