పేరుకు పేదల ప్రతినిధి.. ప్రతి ఊరుకి జగన్ ప్యాలెస్‌ల పథకమిది!

64చూసినవారు
పేరుకు పేదల ప్రతినిధి.. ప్రతి ఊరుకి జగన్ ప్యాలెస్‌ల పథకమిది!
పేదల ప్రతినిధినంటూ ఎన్నో వేదికలపై చెప్పుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రుషికొండపై వందల కోట్లతో తాను నివాసం ఉండేందుకు ఓ పెద్ద ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. అదే మాదిరిగా తన పార్టీకి చెందిన కార్యాలయాలన్నీ ఉండాలని తన అనుచర గణానికి హుకుం జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో వైకాపా కార్యాలయాల పేరుతో ప్యాలెస్‌ల నిర్మాణానికి పథక రచన చేశారు.

సంబంధిత పోస్ట్