ఆఫ్ఘాన్ అభిమానితో గొడవపడ్డ పాక్ బౌలర్(వీడియో)

84చూసినవారు
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఆఫ్ఘాన్ అభిమానితో గొడవకు దిగారు. నిన్న ఐర్లాండ్, పాక్ మధ్య టీ20 మ్యాచ్ కు ముందు అఫ్రిది కొందరు అభిమానులకు ఆటోగ్రాఫ్ లతో పాటు సెల్ఫీలు ఇచ్చారు. ఈ సమయంలో ఆఫ్ఘాన్ కు చెందిన ఓ అభిమాని అసభ్యకరమైన భాషతో అఫ్రిదిని దూషించాడు. దీంతో అతడు ఆగ్రహానికి గురయ్యారు. ఇరువురూ వాదనలకు దిగారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని సముదాయించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్