ఐపీఎల్ 2025లో జైపూర్ వేదికగా ఆదివారం ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. RR కెప్టెన్ సంజు శాంసన్ 15 పరుగులకు ఔట్ అయ్యారు. కృనాల్ పాండ్య వేసిన 6.5వ బంతికి భారీ షాట్ ఆడేందుకు శాంసన్ ముందుకొచ్చారు. అది గమనించిన కీపర్ జితేశ్ శర్మ సంజుని స్టంపౌట్ చేసి పెవిలియన్‌కు పంపారు. 7 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 50/1గా ఉంది. క్రీజులో జైస్వాల్(32), పరాగ్ (1) ఉన్నారు.