పాక్ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో కోత

76చూసినవారు
పాక్ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో కోత
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దాదాపు రూ.869 కోట్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నేషనల్ టీ20 కప్ సందర్భంగా దేశీయ పురుష క్రికెటర్ల మ్యాచ్ ఫీజులలో 75% కోత పెట్టింది. అలాగే, ఆటగాళ్లకు వసతి, ప్రయాణ సౌకర్యాలను కూడా తగ్గించింది. తాజాగా మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. పాక్ కరెన్సీలో 20-25 వేలకు మ్యాచ్ ఫీజు తగ్గించినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్