పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ జయంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఇతర నేతలు పార్లమెంట్‌లోని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి.