పార్టీ ఫిరాయింపులు.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్

80చూసినవారు
పార్టీ ఫిరాయింపులు.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్
తమ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈనెల 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ జరగనుంది. హైకోర్టు దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్