వందే భారత్ రైలులో వడ్డించిన ఆహారం 5 స్టార్ హోటల్లో భోజనంలా ఉందన్న ప్రయాణికుడు.. IRCTC హర్షం

81చూసినవారు
వందే భారత్ రైలులో వడ్డించిన ఆహారం 5 స్టార్ హోటల్లో భోజనంలా ఉందన్న ప్రయాణికుడు.. IRCTC హర్షం
వందే భారత్ రైలులో వడ్డించిన ఆహారాన్ని ఓ ప్రయాణికుడు ఫైవ్ స్టార్ హోటల్ భోజనంతో పోల్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సదరు వ్యక్తి నెట్టింట పోస్టు చేశాడు. “ఈరోజు నేను ఉదయపూర్ నుంచి ఆగ్రా వరకు ప్రయాణించాను. ఈ రైలులో వడ్డించిన భోజనం రుచి పరంగా ఫైవ్ స్టార్ హోటల్ కంటే ఏమాత్రం తక్కువ కాదు” అని రాసుకొచ్చాడు. దీనిపై IRCTC హర్షం వ్యక్తం చేసింది. "ఫైవ్ స్టార్ హోటల్ తో పోల్చినందుకు ధన్యవాదాలు. మేం అత్యుత్తమంగా పనిచేయడానికి ఇలాంటివి ప్రేరేపిస్తాయి” అని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్