జంట పేలుళ్ల కేసు.. దోషుల అప్పీళ్లను తిరస్కరించిన హైకోర్టు

69చూసినవారు
జంట పేలుళ్ల కేసు.. దోషుల అప్పీళ్లను తిరస్కరించిన హైకోర్టు
TG: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాపులో, మిర్చిపాయింట్‌ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ప్రధాన నిందితుడు మహమ్మద్‌ రియాజ్‌ పరారీలో ఉండగా, మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్