'రాజారెడ్డి జీవితం ఆదర్శం'

348చూసినవారు
'రాజారెడ్డి జీవితం ఆదర్శం'
మొదట వ్యాపారవేత్తగా ఉన్న రాజారెడ్డి, సీఐటీయూలో చేరి వామపక్ష భావాలను అర్థం చేసుకుని క్రమ క్రమంగా తన వ్యాపారాలకు స్వస్తి పలికాడని, పేద మధ్యతరగతి వర్గాలకు, దళితులకు, కార్మిక వర్గానికి అండగా నిలబడి పోరాటాలు చేశాడని, రాజారెడ్డి జీవితం పలువురికి ఆదర్శమని వ్యక్తలు కొనియాడారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ఆర్ సిఓఎ క్లబ్ లో, యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు, కార్మికవర్గానికి రాజారెడ్డి చేసిన సేవలను కొనియాడారు.

వివిధ యూనియన్లకు ఆయనతో సాన్నిహిత్యం సంబంధాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన గ్రామంలోనే 13 ఎకరాల తన సొంత భూమిని నిరుపేద రైతులకు ఉచితంగా అందించిన సహృదయుడని కొనియాడారు. ఈ కార్యక్రమానికి యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నవతెలంగాణ చీఫ్ ఎడిటర్ వీరయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసింహారావు, గౌరవ అధ్యక్షులు పి రాజారావు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వై గట్టయ్య, బి ఎం ఎస్ నాయకులు మల్లయ్య, ప్రముఖ విశ్లేషకులు రామ్మూర్తి, ఐఎఫ్టియు నాయకులు కె.విశ్వనాధ్, శ్రీనివాస్ అధికారులు త్యాగరాజు, మనోహర్ తో పాటు యూనియన్ నాయకులు, మెండ శ్రీనివాస్, రామగిరి రామ స్వామి, వెంకట స్వామి తో పాటు అధిక సంఖ్యలో కార్మికులు కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్