పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశోరాం కార్మికులకు మెరుగైన దీపావళి బోనస్ చెల్లించాలని కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి, ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్ కార్మికులతో కలిసి గురువారం కంపనీ గేట్ ముందు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన కంపనీ ప్లాంట్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి చర్చలు జరపడానికి రెండూ రోజులు గడువు కోరడంతో కార్మికులు శాంతించి తిరిగి విధులకు హాజరయ్యారు.