
రామగుండం: లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించాలి
కాశ్మీర్ లోని పహల్గాంలో మారు పోలీసు వేషంలో వచ్చి విచక్షణ రహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించాలని గురువారం ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఆర్గనైజేషన్ సభ్యులు సమావేశం నిర్వహించి తెలిపారు. అధ్యక్షులు షేక్ హాజీ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు జాకీర్ అలీ, షేక్ హుస్సేన్ బాజీలు మాట్లాడుతూ కాశ్మీర్లో పర్యాటకులను కిరాతకంగా చంపిన జిహాద్ పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులను గుర్తించి అంతమొందించాలన్నారు.